ప్రశాంతంగా తొలిరోజు ఎంసెట్‌.. 99.1 శాతం హాజరు

-

గత వారం వర్షాల కారణంగా తెలంగాణ పలు షెడ్యూల్డ్‌ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సెట్‌తో పాటు ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను వాయిదా వేశారు. అయితే ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షలను మాత్రం వాయిదా వేయలేదు. ఈ క్రమంలోనే టీఎస్ ఎంసెట్ -2022 ప‌రీక్ష తొలి రోజు ప్ర‌శాంతంగా ముగిసింది. తెలంగాణ‌, ఏపీలో సోమ‌వారం నిర్వ‌హించిన రెండు సెష‌న్ల‌కు 91.4 శాతం మంది విద్యార్థులు ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌కు హాజ‌రైన‌ట్లు క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ ఏ గోవ‌ర్ధ‌న్ వెల్ల‌డించారు.

TS EAMCET 2022 on July 14

అత్య‌ధికంగా నిజామాబాద్ జిల్లాలో 99.1 శాతం మంది విద్యార్థులు హాజ‌రు కాగా, అత్య‌ల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 88.9 శాతం మంది హాజ‌ర‌య్యారు. తొలి రోజు జ‌రిగిన ఇంజినీరింగ్ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు 58,548 మంది విద్యార్థుల‌కు గానూ 53,509 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. రేపు, ఎల్లుండి కూడా ఇంజినీరింగ్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లు కొన‌సాగ‌నున్నాయి. ఇదిలా ఉంటే.. సోమవారం పలు చోట్ల వర్షాలు కురియడంతో.. వర్షంలోనే విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news