Breaking : ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. తాజా నివేదిక

-

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలన్నంటున్నాయి. తాజాగా వాతావరణ శాఖ ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రుతుపవన ద్రోణితో పాటు అల్పపీడనం ప్రభావం చూపుతున్నట్టు వివరించింది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, కోట, గుణా, ఈశాన్య విదర్భ పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉందని, అల్పపీడనం రాయ్ పూర్, పరదీప్ మీదుగా పయనించి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిమీ ఎత్తులో ఆవరించి ఉందని వెల్లడించింది అమరావతి వాతావరణ కేంద్రం.

IMD forecasts heavy rains in Telangana for the next 24 hours; orange alert  issued

వీటి ప్రభావంతో ఏపీలో రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది అమరావతి వాతావరణ కేంద్రం. ఇవాళ చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది అమరావతి వాతావరణ కేంద్రం. కాగా, ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పడమర దిశల నుంచి గాలులు వీస్తాయని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news