తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 3, 5 ఏళ్ల లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ లాసెట్-2022) దరఖాస్తు ప్రక్రియ గడువు తేదీని పొడగించారు. టీఎస్‌పీజీఎల్‌సీఈటీ-2022, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగిస్తున్నట్లు కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 6 తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు కొనసాగాయి. అయితే విద్యార్థుల విన్నపం మేరకు దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు జీబీ రెడ్డి తెలిపారు.
జూన్ 16వ తేదీ వరకు దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.1000 దరఖాస్తు ఫీజు నిర్ణయించారు. అలాగే రూ.500 నుంచి రూ.2000 వరకు ఆలస్య రుసుంతో జులై 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా పరీక్షలు మాత్రం జులై 21, 22 తేదీల్లో జరగనున్నాయి.