కాంగ్రెస్ నేతల రక్తంలోనే అవినీతి ఉంది: పంజాబ్ సీఎం

-

పంజాబ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం భగవంత్ మాన్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ లో కాంగ్రెస్ నేతలు సీఎం భగవంత్ మాన్ నివాసం ఎదుట నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలను గురువారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం స్పందించారు.

కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపుల కేసులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలకు మద్దతుగా ఆ పార్టీ నేతలు తన నివాసం వద్ద నిరసన చేపట్టారు అని మండిపడ్డారు. పంజాబ్ ను అక్రమంగా దోచుకున్న వారిని కాపాడడానికి కాంగ్రెస్ ఇలా చేస్తోందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు తమ రక్తంలోనే అవినీతి ఉందని నిరూపించుకుంటున్నారు అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అవినీతి కాంగ్రెస్ నేతలకు హక్కుగా మారిందని సీఎం ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news