“టోల్ చార్జెస్ పెంపు”పై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల !

-

నూతన ఆర్ధిక సంవత్సరాన్ని పురస్కరించుకుని NHAI కి సంబంధించి టోల్ చార్జెస్ ను పెంచుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎంత శాతం పెరుగుతాయన్నది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. బహుశా ఏప్రిల్ ఒకటవ తేదీన తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయడం జరిగింది. తెలంగాణ హైవే లకు సంబంధించి మొత్తం 32 టోల్ గేట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లేఖలో మంత్రి మాట్లాడుతూ , ఇప్పటికే ఉన్న టోల్ చార్జెస్ తెలంగాణా ప్రజలకు అధిక భారంగా మారిందని… ఇంతలోనే మళ్ళీ వాటిని పెంచితే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు ఉంటుందని చమత్కరించారు.

ప్రధాన విషయాన్ని తీసుకుని అన్ని సమీకరణాలను మంత్రి గడ్కరీకి ఈ లెటర్ లో ప్రశాంత్ రెడ్డి వివరించే ప్రయత్నం చేశారు. మరి కేంద్రం ఈ లెటర్ ను పరిగణలోకి తీసుకుని టోల్ గేట్స్ చార్జెస్ పెంపు విషయంలో ఏమైనా మార్పులు చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news