Breaking : సూపర్‌వైజర్ గ్రేడ్-1 పోస్టుల ప్రైమరీ కీ విడుదల

-

మహిళాశిశు సంక్షేమశాఖలో సూపర్‌ వైజర్‌-1 పోస్టులకు ఈ నెల 8న నిర్వహించిన రాత పరీక్ష ప్రైమరీ కీని TSPSC ప్రకటించింది. కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రం, పరీక్షకు హాజరైన 33,405మంది అభ్యర్థుల OMR కాపీలను వైబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొంది. ఈ ప్రిలిమినరీ కీపై అభ్యర్థులు అభ్యంతరాలను ఈనెల 21 నుంచి 24 సాయంత్రం 5గంటల వరకు వెబ్సైట్లో ఇంగ్లీష్ నమోదు చేయాలని సూచించింది. మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో 181 ఉద్యోగాల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.

గ్రేడ్ -1 ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్(సూప‌ర్ వైజ‌ర్) పోస్టుల భ‌ర్తీ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు (టీఎస్పీఎస్సీ గ్రూప్ -1 రిజల్ట్స్ ) ఎట్టకేలకు విడుద‌ల‌య్యాయి. శనివారం టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. దీంతో గ్రూప్ -1 ప్రిలిమిన‌రీ క్వాలిఫై అయిన అభ్య‌ర్థులు ఒక రోజు ముందే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. వచ్చే జూన్ లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. మెయిన్స్ పరీక్షా విధానాన్ని ఈనెల 18వ తేదీన వెల్లడించనున్నట్లు చెప్పారు. మెయిన్స్‌ పరీక్షకు 1: 50 నిష్ఫత్తిలో 25, 050ని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్‌సీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

గత కొన్ని రోజులుగా న్యాయపరమైన అడ్డంకులు రావడంతో ఫలితాల విడుదల సాధ్యం కాలేదు. అయితే. ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు గ్రూప్-1 ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను https: //www. tspsc. gov. in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news