టీఎస్ ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకు వచ్చేందుకు కొత్తకొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు ఆర్టీసీ అధికారులు. ఇప్పటికి వినూత్న ఆలోచనలతో ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తున్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఫాదర్స్‌డే సందర్భంగా ఈ నెల 19న టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐదేండ్ల లోపు పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లిదండ్రులకు అన్ని బస్ సర్వీస్‌ల్లో ఆ ఒక్కరోజు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇటీవల విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఆర్టీసీ కార్గో సేవలను బలోపేతం చేస్తూ ప్రజలకు, ప్రయాణికులకు మరింత అందుబాటులోకి ఆర్టీసీ సేవలను తీసుకువచ్చింది.