టీటీడీ నూత‌న పాల‌క వ‌ర్గ‌ జాబితా ఖరారు.. సభ్యులు వీరే..

-

కోరిన కోరిక‌లు తీర్చే దైవం.. ఆపదమొక్కుల వాడు .. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన పుణ్యక్షేత్రం తిరుప‌తి తిరుప‌తి దేవ‌స్థానం. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య క్షేత్రంగా తిరుప‌తి విరాజిల్లుతున్నది. భ‌క్తుల అవ‌స‌రాలను తీర్చేలా పాల‌క మండలిని ఏర్పాటు చేసింది. అయితే.. నేడు తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ చేప‌ట్టింది ఏపీ సర్కార్. ఇక్క‌డ ప్రధానంగా శ్రీ స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్యకు అనుకూనంగా శ్రీవారి దర్శన సేవ‌లు పెంచాల‌ని డిమాండ్ ఉంది.

ttd

ఇదిలాఉంటే.. సభ్యుల నియామకం ప్ర‌క్రియ‌లో అటు కేంద్రం, ఇటు ఇత‌ర రాష్ట్ర ముఖ్య మంత్రుల నుంచి సిఫార్సులు వచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా ఏపీ రాష్ట్ర మంత్రులు, కీల‌క నేతలు, పారిశ్రామిక వేత్తలు వారి మ‌నుషుల‌ను సిఫార్సు చేసిన‌ట్టు తెలుస్తుంది. ఏదిఏమైన‌ప్ప‌టికి మొత్తానికి శ్రీ‌వారి నూతన పాలకమండలి నియామకం పూర్తి అయ్యింది. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేశారు. కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. బోర్డు సభ్యుల వివరాలను సాయంత్రం తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అధికారికంగా ప్రకటించారు.

గత పాలక వర్గంలో 24 మంది పాలకమండలి సభ్యులు, 8మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండ‌గా.. ఇప్పుడూ ఆ సంఖ్యను 25 కు కుదించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తూ పాలకమండలి కూర్పు జరిగింది.

కొత్త పాలక మండలి సభ్యులు వీరే..

1. పొలకల అశోక్‌,
2. మల్లాడి కృష్ణారావు,
3. మారుతి,
4. జీవన్‌రెడ్డి,
5. పార్థసారథిరెడ్డి,
6. జూపల్లి రామేశ్వరరావు,
7. జే.శ్రీనివాసన్‌,
8. మూసారాంశెట్టి రాములు,
9. కల్వకుర్తి విద్యాసాగర్‌,
10. రాజేశ్‌ శర్మ,
11. సౌరభ్‌,
12. శశిధర్‌,
13. శంకర్‌,
14. విశ్వనాథ్‌ రెడ్డి,
15. గొర్ల బాబూరావు,
16. కన్నయ్య,
17. మిల్లింద్‌,
18. నందకుమార్‌,
19. వేమిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి,
20. కేతన్‌ దేశాయ్‌,
21. లక్ష్మీనారాయణ,
22. కె.రాంభూపాల్‌రెడ్డి,
23. మధుసూదన్‌ యాదవ్
24. శ్రీనివాసన్‌
25. విశ్వ‌నాథ‌న్‌

Read more RELATED
Recommended to you

Latest news