శ్రీవారి లడ్డూపై అపోహలు.. టీటీడీ ఏం చెప్పిందంటే..?

-

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడని వారుండరు. తిరుమలకు వెళ్లలేక పోయినా.. అక్కడికి వెళ్లిన వారితో లడ్డూ తెప్పించుకుంటారు చాలా మంది. అంతటి ప్రియమైన శ్రీవారి లడ్డూపై గతకొంత కాలంగా సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం అవతున్నాయి. వీటిపై తాజాగా టీటీడీ స్పందించింది.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై  సోషల్‌ మీడియాలో వస్తున్న అపోహలు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఆలయ నిబంధనల ప్రకారం శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాములు బరువు ఉంటుంది. కానీ, ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలు తూకం వేయగా.. 90 నుంచి 110 గ్రాముల బరువు మాత్రమే ఉన్నాయి. దీంతో భక్తుడు లడ్డూ కౌంటర్‌లోని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

టీటీడీ అధికారులు దీనిపై స్పందించి వివరణ ఇచ్చారు. వేయింగ్‌ మిషన్‌లో సాంకేతిక సమస్య కారణంగా, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం వల్లే అలా జరిగిందని తెలిపారు. టీటీడీ లడ్డూ బరువు కచ్చితంగా 160గ్రాములు ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి రాజీ లేకుండా లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను భక్తులు నమ్మవద్దని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news