పాల్వంచ ఘ‌ట‌న‌లో ట్విస్ట్.. వ‌న‌మా ఇంకా దొర‌క‌లేడు : పోలీసులు

-

పాల్వంచ ఘ‌ట‌న‌లో మ‌రో ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది. ఈ కేసులో కీల‌కంగా ఉన్న వ‌న‌మా రాఘ‌వ ఇంకా దొర‌క‌లేద‌ని కొత్త‌గూడెం పోలీసులు తెలిపారు. వ‌న‌మా రాఘ‌వ కోసం తాము గాలిస్తున్నామ‌ని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్ర‌స్తుతం వ‌న‌మా రాఘ‌వా ఆచూకీ లేద‌ని అన్నారు. అయితే తెలంగాణ‌తో పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ లో మొత్తం ఎన‌మిది బృందాల‌తో సెర్చ్ చేస్తున్నామ‌ని తెలిపారు. వ‌న‌మా రాఘ‌వ‌ ఆచూకీ తెలిసిన వెంట‌నే త‌ప్ప‌క ఆరెస్టు చేస్తామ‌ని ఏఎస్పీ తెలిపారు. అయితే ఈ కేసులో స్ప‌ష్ట‌మైన ఆధారాలు ల‌భిస్తే.. వ‌నమా రాఘ‌వపై రౌడీ షీట్ ఓపెన్ న‌మోదు చేస్తామ‌ని ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.

అలాగే వ‌న‌మా రాఘ‌వ పై గ‌తంలో ఉన్న కేసుల ఆధారంగా కూడా ద‌ర్యాప్తు చేస్తామ‌ని తెలిపారు. అయితే వ‌న‌మా రాఘ‌వా త‌మ‌ను హింసిస్తున్నాడ‌ని ఒక కుటుంబం ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఇటీవ‌ల కుటుంబ స‌భ్యుడి సెల్పీ వీడియో కూడా పోలీసుల‌కు దొరికింది. దీంతో వ‌న‌మా రాఘ‌వ‌ను అరెస్టు చేయాల‌ని పోలీసుల గాలిస్తున్నారు. అయితే కొన్ని గంట‌ల క్రిత‌మే వ‌న‌మా రాఘ‌వ‌ను పోలీసులు అరెస్టు చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజా గా పోలీసులు వ‌న‌మా రాఘ‌వ దొర‌క‌లేదంటూ ఏఎస్సీ రాజిత్ రాజ్ ప్ర‌కటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version