సృజన సంబంధ కళ సినిమా
ఎలా చూసినా ఒక్కటే ఎలా మాట్లాడినా ఒక్కటే
అని అనుకుంటే అంతకుమించిన అవివేకం లేదు
అందుకే ఇవాళ కశ్మీర్ ఫైల్స్ దేశ వ్యాప్త చర్చకు తావిస్తోంది
నిశ్శబ్దంగా వచ్చి పెను సంచలనాలకు తావిస్తోంది
ఈ దశలో మాట్లాడాల్సినంత కాంగ్రెస్ మాట్లాడుతోంది
అంతుకు మించి మాట్లాడాల్సినంత బీజేపీ కూడా మాట్లాడి
వార్తల్లో నిలుస్తోంది.. అయినా కూడా ఎవరి వాదన వారిదే !
అవును 100%
కాదు 0%
వివేక్ అగ్ని హోత్రి తెరకెక్కించిన ద కశ్మీర్ ఫైల్స్ సినిమా రాజకీయ చర్చకు దారితీసింది. కశ్మీరీ పండిట్ల ఊచకోత కు సంబంధించి నిజాలు ఇవి అంటూ కాంగ్రెస్ పార్టీ వరుస ట్వీట్లు చేయగా.. అదే స్థాయిలో బీజేపీ కౌంటర్లు ఇచ్చింది. కశ్మీర్ ఫైల్స్ వర్సెస్ ట్రూత్ లో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. చరిత్రను కాంగ్రెస్ పార్టీ సరిగా అర్థం చేసుకోలేదు అంటూ బీజేపీ ఎంపీ కేఎల్ ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఈ సినిమా వివాదం కేరళ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.
మరోవైపు ఈ సినిమా చూసేందుకు ప్రభుత్వం హాలీడే కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రకటించాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. అటు కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక సినిమాను విమర్శించి రచ్చకెక్కినంత మాత్రాన కాంగ్రెస్ కూడా సాధించేది కానీ సంపాదించేది కానీ ఏమీ ఉండదు. కానీ రాజకీయాల్లో ఉన్నారు కనుక బీజేపీ సమర్థించే వాటిపై సహజంగానే కాంగ్రెస్ కానీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ వ్యతిరేకిస్తూ మీడియాలో తమ వ్యాఖ్యలు వినిపించేలా తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి.
ఇదే వ్యతిరేకతలను కమ్యూనిస్టులూ తమదైన శైలిలో వినిపిస్తూనే ఉన్నారు. కనుక గెలుపు ఓటములపై ఒకనాడు సినిమాల ప్రభావం ఉన్నా నేడు ఓటర్లు విచక్షణకు, ప్రజలు తమ మనో బుద్ధి కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకనో/ఎందుకనో కాంగ్రెస్ వ్యతిరేకించినంత మాత్రాన బీజేపీ నష్టపోదు. బీజేపీ తనదైన పంథాలో కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చినంత మాత్రాన రాత్రికి రాత్రి పరిణామాలు ఏం మారిపోవు.
ట్విటర్ పోల్ : కశ్మీర్ ఫైల్స్ పై కాంగ్రెస్ అతి చేస్తుందా?#KashmirFiles #CongressParty
— Manalokam (@manalokamsocial) March 22, 2022