టైలర్ కన్హయ్యలాల్ హత్య కేసు.. 32 మంది ఐపీఎస్‌లు బదిలీ

-

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ హత్య కేసు తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనకారులు ఆందోళన చేపట్టారు. నిందితులు గౌస్ మహమ్మద్, రియాజ్ అక్తారీను ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా రాష్ట్రంలో పనిచేస్తున్న 32 ఐపీఎస్‌లను భారీగా బదిలీ చేశారు. పోలీసులపై తీవ్రంగా విమర్శలు రావడంతో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఉదయ్‌పూర్ కేసు-ఐపీఎస్‌లు బదిలీ
ఉదయ్‌పూర్ కేసు-ఐపీఎస్‌లు బదిలీ

బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు టైలర్ కన్హయ్యలాల్ మద్దతు తెలిపాడు. దీంతో నిందితులు రియాజ్ అక్తారీ, గౌస్ మహమ్మద్.. టైలర్ కన్హయ్యలాల్ తల నరికి చంపేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా అల్లర్లు చలరేగాయి. ఈ మేరకు విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలు విషయాలను వెల్లడించింది. నిందితులకు ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించింది. ఉదయ్‌పూర్ ఘటనను ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్లు రాజస్థాన్ పోలీస్ చీఫ్ ఎంఎల్ లాథర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news