ప్రస్తుతం మన దేశంలో అమలులో ఉన్న ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సంక్షేమ పథకానికీ మరియు ఇతర కార్యకలాపాలకు ఆధార్ కార్డు మనదేశంలో తప్పనిసరి. అయితే వ్యక్తులకు కేటాయించిన ఆధార్ కార్డు సంఖ్యను మార్చివేసి మరో సంఖ్యను కేటాయించడం సాధ్యం కాదని తాజగా భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్ ) ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
ఇలాంటివి కనుక ఒకసారి అనుమతిస్తే వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ లో మాదిరిగా తమకు నచ్చిన ఫ్యాన్సీ నెంబర్లు కోసం ప్రతి ఒక్కరి నుంచి అభ్యర్థులు వెళ్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వ్యాపారి తనకు కేటాయించిన ఆధార్ సంఖ్యను మార్చాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును తాజాగా ఆశ్రయించాడు.
తన ఆధార్ గుర్తుతెలియని విదేశీ సంస్థలకు అనుసంధానమై ఇబ్బందులు కలుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు జస్టిస్ రేకపల్లి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో… భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… ప్రతి ఆధార్ కార్డు దారులు అందించిన సమాచారానికి పూర్తి భద్రత ఉందని తెలిపారు. ఇప్పుడు ఆధార్ కార్డు సంఖ్యను మారిస్తే అనేక చిక్కులు వస్తాయని కోర్టుకు విన్నవించారు.