పార్లమెంట్ సమావేశాలు: ఉక్రెయిన్ అంశం, మిస్సైల్ మిస్ ఫైర్ పై ప్రకటన చేయనున్న కేంద్రమంత్రులు

-

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్దంపై, ఆపరేషన్ గంగ పై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఈరోజు పార్లమెంట్ లో కీలక ప్రకటన చేయనున్నారు. ఆపరేషన్ గంగ ద్వారా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఎయిర్ లిప్ట్ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్ లో సభ్యులకు వివరించనున్నారు. దాదాపు 20 వేలకు పైగా భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి ఇండియాకు చేరుకున్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్వదేశం చేరారు. 

మరోవైపు ఇటీవల బ్రహ్మోస్ మిస్సైల్ మిస్ ఫైర్ అయి పాకిస్థాన్ భూభాగంలో పడింది. దీనిపై ప్రకటన చేయనున్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఇటీవల రెగ్యులర్ మెయింటనెన్స్ చేస్తుండగా.. మిస్సైల్ మిస్ ఫైర్ అయి పాకిస్థాన్ భూభాగంలో పడింది. దీనిపై పాకిస్థాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత రాయబారిని పిలిచి తమ నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేంద్రం కూడా సీరియస్ అయింది. భారత రక్షణ శాఖ ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసింది. మరోవైపు పాకిస్తాన్ జాయింట్ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news