ప్రతి చావుకు ప్రతీకారం తీర్చుకుంటాం.. జపోరిజియా ఘటనపై జలెన్ స్కీ ఫైర్

-

జపోరిజియాలోని ఉక్రెయిన్ నియంత్రణ పరిధి ప్రాంతాలపై రష్యా ఊచకోతపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. రష్యా భీకర దాడిని ఖండించారు. జపోరిజియాలోని ప్రతి ఉక్రెయిన్ పౌరుడి, సైనికుడి చావుకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.

“యుద్ధ క్షేత్రంలో ఎదురవుతున్న పరాభవాన్ని, మా సేనలు కనబరుస్తున్న సమర్థతను చూసి శత్రువు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే కోపంతో ఈరోజు విరుచుకుపడి, అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నాడు. మేము కోల్పోయిన ప్రతి ప్రాణం విషయంలోనూ శత్రు దేశం సమాధానం చెప్పక తప్పదు. ఆ సమయం తప్పకుండా వస్తుంది.” అని జెలెన్‌స్కీ అన్నారు.

తాము రష్యాతో చర్చలకు సిద్ధమేనని, అయితే మరో అధ్యక్షుడితో మాత్రమే చర్చలు జరుపుతామని జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరే విషయమై దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. ఇందుకు నిర్ణయాత్మకంగా ముందడుగువేసి ‘యాక్సెలెరేటెడ్‌ అప్లికేషన్‌’ను సమర్పిస్తున్నాం” అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news