Pak vs Eng : అంపైర్‌ పై పగతీర్చుకున్న పాక్‌ బ్యాటర్‌…వీడియో వైరల్‌

-

పాక్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్‌..నిన్న జరిగిన 6వ టీ 20 లో గ్రాండ్‌ విక్టీరీ కొట్టింది. దీంతో సిరీస్‌ ను 3-3 తో సమం చేసింది ఇంగ్లాండ్‌ జట్టు. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ బ్యాట్స్‌ మెన్‌ ఫిలిప్‌ సాల్ట్‌ అకాశమే హద్దుగా చెలరేగడంతో.. మొయిన్‌ అలీ బృందానికి ఈ విజయంసాధ్యమైంది.

అయితే.. ఈ 6వ టీ20 మ్యాచ్‌ లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో అంపైర్ ఆలీమ్ దార్ గాయపడ్డాడు. పాక్ బ్యాటర్ హైదర్ అలీ కొట్టిన భారీ షాట్ లెగ్ ఎంపైర్ దార్ కు బలంగా తాకింది. బంతి నుంచి తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించినా కుదరలేదు. తొడ భాగానికి తగలడంతో దార్ కాసేపు నొప్పితో బాధపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news