ఛీ..ఛీ.. కామంతో బాలికపై చిన్నాన్నే అత్యాచారం

ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని కఠిన శిక్షలు విధించిన కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ మహిళలపై జరిగే దారుణాలు మాత్రం తగ్గడం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మగవారు మృగాళ్ల వారి కామవాంఛ తీర్చుకుంటున్నారు. వరుసకు కూతురు, చెల్లి అయినప్పటికీ వారి కోరికలు తీర్చుకునేందుకు చిన్న పిల్లల్ని సైతం బలి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌లో జరిగింది. తల్లిదండ్రులు లేని ఓ బాలిక ఆశ్రమంలో ఉంటే.. ఆమెను పెంచుకుంటామని చెప్పిన బాబాయ్ బాలికపై అత్యాచారం చేశాడు.

Both boys and girls at risk of sexual harassment in high school - Taylor &  Francis Newsroom

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..మధురా నగర్ PS పరిధిలోని తల్లిదండ్రులు లేని ఓ బాలిక ఆశ్రమంలో ఆశ్రయం పొందుతుంది. ఈ మేరకు ఆ అమ్మాయిని పెంచుకుంటామని, బాలిక బాగోగులు చూసుకుంటామని చెప్పిన ఓ వ్యక్తి (వరుసకు చిన్నాన్న) ఆశ్రమం నుంచి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అదే ఆశ్రమంలో వదిలేశాడు. అయితే బాలిక ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆశ్రమ నిర్వాహకులు ఆరా తీశారు. దీంతో చిన్నాన్న అత్యాచారం చేసినట్లు తెలుపడంతో మధురా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.