Breaking : మరో 4 రోజుల్లో 800 కోట్లకు ప్రపంచ జనాభా

-

ఐక్యరాజ్యసమితి తాజాగా షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ జనాభా భారీగా పెరుగుతోందని.. మరో నాలుగు రోజుల్లో అంటే ఈ నెల 15 నాటికి 800 కోట్లకు జనాభా పెరగనుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 1950 జనాభాతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువని తెలిపింది ఐక్యరాజ్య సమితి. 2030 నాటికి ప్రపంచ జనాభా 850 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది ఐక్యరాజ్యసమితి. ప్రస్తుతం ఎక్కువ జనాభా కలిగిన దేశంగా చైనా ఉందని… 2023లో చైనాను భారత్ అధిగమిస్తుందని తెలిపింది ఐక్యరాజ్య సమితి. 2020లో జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా నమోదయిందని… 1950 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారని చెప్పింది.

World population evolution | Historic growth and causes - Iberdrola

2050 నాటికి ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2080 నాటికి జనాభా వెయ్యి కోట్లను దాటుతుందని… 1,040 కోట్లకు చేసుకుంటుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2100 నాటికి 1,120 కోట్లను దాటుతుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ప్రపంచ జనాభా వృద్ధిలో 50 శాతానికి పైగా కేవలం 8 దేశాల్లోనే సంభవిస్తోందని తెలిపింది ఐక్యరాజ్య సమితి. భారత్, నైజీరియా, ఇథియోపియా, ఈజిప్ట్, కాంగో, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్, టాంజానియా దేశాల్లో అధిక జనాభా వృద్ధి రేటు ఉందని వెల్లడించింది ఐక్యరాజ్య సమితి.

Read more RELATED
Recommended to you

Latest news