మంత్రి కేటీఆర్‌కు కేంద్రమంత్రి కౌంటర్‌

-

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో మంత్రి కేటీఆర్ తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నుంచి కేంద్రానికి సరైన సహకారం అందడంలేదని విమర్శించారు. తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోందని మంత్రి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రూ. 886 కోట్ల రైల్వే కేటాయింపులు జరిగితే.. తెలంగాణ ఏర్పడ్డాక..రూ. 4,418 కోట్లను కేటాయించామని వెల్లడించారు. రాష్ట్రంలో రూ. 29,581 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని, మరో 39 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తామన్నారు.

రాష్ట్రంలో వేగన్ తయారీ కేంద్రం ఏర్పాటు కోసం రూ. 521 కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇందుకు 160 ఎకరాలు స్థలం అవసరంకాగా.. ప్రభుత్వం 150 ఎకరాలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. తెలంగాణలో మరో 20 ఎంఎంటీఎస్ కొత్త ట్రైన్లు నడుస్తాయని.. సికింద్రాబాద్ నుండి మేడ్చల్ మధ్య అవి పరుగులు పెడతాయన్నారు. తెలంగాణకు రెండు ఎక్స్ లెన్సీ కేంద్రాలు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news