అమెరికాపై జైశంకర్ ఫైర్.. ఎవరినీ ఫూల్స్ చేయలేరంటూ వ్యాఖ్యలు

-

పాకిస్థాన్‌కు ఎఫ్​-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాపై ఫైర్ అయ్యారు. యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి అమెరికా చేసిన ప్రకటనను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.

తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్​-16 యుద్ధ పరికరాలను పాకిస్థాన్‌కు విక్రయిస్తున్నట్లు బైడెన్‌ యంత్రాంగం తెలిపింది. తమ చర్య దక్షిణాసియాలో సమతౌల్యాన్ని దెబ్బతీయదంటూ ముక్తాయింపు ఇచ్చింది. ఎఫ్​-16ల సామర్ధ్యం ఏమిటో.. వాటిని పాక్‌ ఎక్కడ వాడుతుందో అందరికీ తెలుసని.. ఈ విషయంలో ఎవరినీ ఫూల్స్‌ చేయలేరని జైశంకర్ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్‌తో సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతమాత్రం ఉపయోగపడవని అభిప్రాయపడ్డారు.

వాషింగ్టన్‌లో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ విధానాలను రూపొందించే వారితో మాట్లాడాల్సి వస్తే.. మీరు ఏం చేస్తున్నారని అని అడుగుతానని జైశంకర్ అన్నారు.

ఇటీవలే పాకిస్థాన్‌కు ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు మరమ్మతు, విడిభాగాల సరఫరా, సాఫ్ట్‌వేర్‌, ఇంజిన్‌ హార్డ్‌వేర్‌ ఆధునికీకరణ, ఎలక్టాన్రిక్‌ పోరాట సామర్థ్యం తదితరాలను సమకూర్చాలని అమెరికా నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news