టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ గా నటించిన ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కేవలం సినిమాలలోనే కాకుండా బుల్లితెరపై కూడా పలు షో ల కి జడ్జ్ గా వ్యవహరిస్తూ తన అందంతో మాటలతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది. ఇకపోతే పూర్ణ ఇప్పటివరకు తన పెళ్లి విషయంలో ఏమాత్రం క్లారిటీ ఇవ్వకుండా ఒక్క సారిగా ఒక అబ్బాయి తో తను ఉన్న ఫోటోను షేర్ చేసి కాబోయే భర్త అని అందరికీ పరిచయం చేసింది. అంతేకాదు ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలతో కింద ఎంగేజ్మెంట్ కూడా అయిపోయినట్లు రింగు కలిగిన బొమ్మను షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే పూర్ణ ఇంత సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకు షాక్ ఇవ్వడం ఏంటి అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన వివాహమా లేక రహస్యంగా ప్రేమించుకుని అతడినే వివాహం చేసుకుంటోందా అనే వార్తలు కూడా వినిపించాయి. ఇక మొత్తానికి అయితే పూర్ణ షేర్ చేసిన అబ్బాయితో వీరి జంట చాలా క్యూట్గా ఉంది అని అభిమానులు సైతం ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇకపోతే పూర్ణ .. షానిద్ అసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంటోంది. ఇక అతనికున్న ఆస్తుల వివరాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి.
ఇక షాహిద్ అసిఫ్ అలీ ఏం చేస్తుంటారు .. అతని ప్రాపర్టీ ఎంత అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇతను ఒక పెద్ద బిజినెస్ మాన్. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఫౌండర్ అలాగే సీఈవో కూడా.. దుబాయ్ వేదికగా జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వర్క్ చేస్తూ ఉంటాయి.ఇది ఒక బిజినెస్ కన్సల్టెన్సీ.. డాక్యుమెంట్ క్లియరింగ్ సర్వీసెస్ అందించే సంస్థ ముఖ్యంగా యు ఏ ఈ లో వ్యాపారాలు చేసుకునే వారికి డాక్యుమెంటేషన్ పరంగా అనుమతుల విషయంలో వీరు సర్వీసెస్ అందిస్తూ ఉంటారు. అంతే కాకుండా ఇమ్మిగ్రేషన్, వీసా అనుమతులకు సంబంధించి కూడా సేవలు అందిస్తూ వుంటారు . ఇక ఈయన ఆస్తులు కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంటాయని సమాచారం.