Unstoppable : బాలయ్య ‘అన్ స్టాపబుల్ విత్ NBK2’ వచ్చేస్తోంది!

-

సినిమాల‌తోనే కాకుండా హోస్ట్ గా త‌న‌లోని మ‌రో టాలెంట్ ను బ‌య‌ట పెడుతూ.. దిగ్విజ‌యంగా ముందుకు సాగుతున్నారు హీరో నంద‌మూరి బాల కృష్ణ‌. తెలుగు ఓటీటీ ఆహా వేదిక‌గా ప్ర‌సార‌మ‌వుతున్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే అనే షో లో బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ టాక్ షో కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

టాలీవుడ్‌ స్టార్లు ఈ షోకు వచ్చి సందడి చేశారు. అయితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK2’ మళ్లీ రాబోతోంది. ‘అన్ స్టాపబుల్ విత్ NBK2’ తో బాలయ్య అలరించేందుకు రాబోతున్నట్లు ఓటిటి ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ప్రకటించింది. ‘పండుగ త్వరలో ప్రారంభం కానుంది. దెబ్బకు థింకింగ్ మారిపోవాలి’ అని ట్వీట్ చేసింది. దీంతో ‘అన్ స్టాపబుల్ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. కాగా.. ప్రస్తుతం NBK 107 సినిమా షూటింగ్ లో బాలయ్య బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news