కాంగ్రెస్ తీసుకోస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం ఇదే..ఫోటో వైరల్

-

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వివాదం చోటు చేసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహం విషయమై వివాదం రాజుకుంది. దీంతో నేలతంతా రెండుగా చీలిపోయారు. కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను తిరస్కరిస్తూ ఒక వర్గం, మద్దతుగా మరో వర్గం తయారయింది. కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

రేపు కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించడానికి టీపిసిసి చీఫ్ రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దని రేవంత్ పై సీనియర్లు ఒత్తిడి తెస్తున్నారు. నిన్న సీనియర్ల సమావేశంలో గాంధీభవన్ లో సెప్టెంబర్ 17 వేడుకలపై చర్చ జరిగింది.

ఈ చర్చలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపు గాంధీభవన్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పై టీపీసీసీ చీఫ్ తర్జన భర్జన పడుతున్నారు.ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు కాంగ్రెస్‌ తీసుకువస్తానన్న తెలంగాణ తల్లి విగ్రహం ఫోటోలు వైరల్‌ గా మారాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. ఈ విగ్రహం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news