యూపీలో బీజేపీ దూకుడు.. డోర్ టూ డోర్ ప్రచారం షురూ

-

వచ్చే నెలలో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. గత ఐదేండ్ల పాలనా కాలంలో యోగి సర్కార్ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కమలం కార్యకర్తలు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించింది. ఐదుగురితో కూడిన కార్యకర్తల సమూహం డోర్ టూ డోర్ వెళ్లి యోగి సర్కార్‌ పాలన గురించి వివరించనున్నారు. ఈ నెల 14 నుంచి ‘ఎల్‌ఈడీ వాహనాల’తో ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. గత ఐదేండ్ల కాలంలో యోగి సర్కార్ సాధించిన విజయాలను పెద్ద పెద్ద ఎల్‌ఈడీ టీవీల ద్వారా ప్రచారం చేయనున్నారు.

ఉత్తర‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల‌ను దృష్టిలో పెట్టుకుని న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహిస్తున్న కోర్ కమిటీ మీటింగ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేపీ మౌర్య హాజరయ్యారు.

మరోవైపు పంజాబ్‌ రాష్ట్రంలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. కేంద్ర మంత్రి హరిదీప్ పురి, గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అరవింద్ ఖన్నా, శిరోమణి అకాలీదల్ నేత గుర్‌దీప్ సింగ్ గోష, అమృత్‌సర్ మాజీ కౌన్సిలర్ ధర్మవీర్ జైన్ తదితరులు బీజేపీ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version