Breaking : మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఇక డిజిటల్ చెల్లింపులు

-

ఏపీ మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభమైంది. రాష్ట్ర ఆబ్కారీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ నేడు మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రారంభించారు. తొలివిడతలో 11 మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ లావాదేవీలు ఉంటాయని రజత్ భార్గవ వెల్లడించారు. అనంతరం, 3 నెలల్లో అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రవేశపెడతామని చెప్పారు. మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపుల కోసం ఎస్ బీఐ సహకారం తీసుకుంటున్నామని వివరించారు. డెబిట్ కార్డు, యూపీఐ లావాదేవీలకు అదనపు చార్జీలు ఉండవని రజత్ భార్గవ స్పష్టం చేశారు. క్రెడిట్ కార్డు లావాదేవీలకు మాత్రం నిబంధనల ప్రకారం చార్జీలు ఉంటాయని తెలిపారు.

కోవిడ్ అనంతరం డిజిటల్ చెల్లింపులు వైపు జనాలు ఇంట్రస్ట్ చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు క్యాష్ క్యారీ చేసేవారు చాలా అరుదనే చెప్పాలి. ఈ సమయంలో కూడా ఏపీలోని మద్యం దుకాణాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో మందుబాబులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ షాపుకు వెళ్దామనుకున్న ప్రతిసారీ క్యాష్‌ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇక బయట రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లినవారికి ఇది మరీ ఇబ్బందికరంగా మారింది. మందుబాబుల రిక్వెస్టులతో పాటు.. క్యాషియర్‌ల చేతి వాటం, నగదు లావాదేవీల్లో వ్యత్యాసానికి సంబంధించి ఫిర్యాదులు అందడంతో.. డిజిటల్ పేమెంట్స్‌కు ప్రభుత్వం మొగ్గు చూపింది.

Read more RELATED
Recommended to you

Latest news