ఈ మధ్య ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ ని ఎక్కువ మంది చేస్తున్నారు. దీనితో చాలా మందిలో ఎన్నో సందేహాలు ఉంటున్నాయి. ఒక్క ఆగస్టు నెలలోనే యూపీఐ ద్వారా 657 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయట. అంటే ఎంతలా ఆన్ లైన్ పేమెంట్స్ వాడకం పెరిగిందో చూసారా..? ఇక ఇది ఇలా ఉంటే మనం యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ గురించి మరియు బ్యాంక్స్, యూపీఐ సింగిల్ ట్రాన్సాక్షన్, డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్స్ గురించి చూసేద్దాం.
అసలు యూపీఐ ఎలా పని చేస్తుంది…?
మొదట యూపీఐ ఎలా పని చేస్తుంది అనేది చూస్తే.. యూపీఐలో వర్చువల్ పేమెంట్ అడ్రస్‌ను సెట్ చేసి డబ్బులను పంపాలి. ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ని లింక్ చెయ్యవచ్చు. IFSC కోడ్ లేదా అకౌంట్ నంబర్ తో మనం ఈజీగా డబ్బులను పంపాలి.
ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి పేమెంట్స్ యాప్స్ ని ఉపయోగించి పేమెంట్స్ చెయ్యచ్చు. BHIM UPI యాప్‌తో పాటు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్స్ ని ఉపయోగించి మనం యూపీఐ ట్రాన్సాక్షన్లు చెయ్యచ్చు.
యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ వివరాలు:
మినిమం ఏమి లేదు. కానీ ఒక్కో కస్టమర్‌కు రూ.2 లక్షలు మాక్సిమం లిమిట్. ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ సంస్థలు యూపీఐ డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను ఇలా నిర్ణయించాయి. ఎన్‌పీసీఐ ప్రకారం బ్యాంకులు తమ సొంత యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ సెట్ చెయ్యచ్చు.
బ్యాంక్స్, యూపీఐ సింగిల్ ట్రాన్సాక్షన్ మరియు డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ వివరాలు:
ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, సిటీ బ్యాంకు సింగిల్ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ.1 లక్ష.
సిటీ యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, దేనా బ్యాంకు యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ.1 లక్ష.
ఐసీఐసీఐ బ్యాంక్ సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.10 వేలు. గూగుల్ పే యూజర్లకు రూ.25 వేలు. రోజుకి ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.10 వేలు (గూగుల్ పే యూజర్లకు రూ.25 వేలు).
కెనరా బ్యాంక్ లిమిట్ రూ.10 వేలు. రోజుకి రూ.25 వేలు పంపచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.25 వేలు. రోజుకి రూ.1 లక్ష పంపచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.10 వేలు. రోజుకి రూ.1 లక్ష పంపచ్చు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.25 వేలు. రోజుకి రూ.50 వేలు పంపచ్చు.