ఆ నిర్ణయంతో ట్రంప్ పై మహిళల్లో వ్యతిరేకత…!

-

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్లు.. తమదైన స్టైల్లో రెచ్చిపోతున్నారు. బైడెన్‌ దేశ ప్రజల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తాడన్నారు ట్రంప్‌. అంతేకాకుండా ఎన్నికల్లో ఓడిపోతే అమెరికా విడిచి వెళ్లిపోతానేమోనని ట్రంప్‌ పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం పై మహిళలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేట్‍ జస్టిస్‍ రుత్‍ బదేర్‍ గిన్‍బర్గ్ స్థానంలో అమీ కానే బర్రేట్‍ను తీసుకువచ్చేందుకు ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలపై మహిళల నుంచి వ్యతిరేకత వస్తోంది. మహిళ హక్కుల లిజరల్‍ ఛాంపియన్‍ అయిన గిన్‍బర్గ్ సెప్టెంబర్‍ 18న మరణించారు. ఆమె స్థానంలో బర్రేట్‍ నామినేషన్‍ను ఫైనల్‍ చేసేందుకు రిపబ్లికన్లు తహతహలాడుతున్నారని ఆందోళకారులు విమర్శించారు.

జార్జియాలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో.. డెమొక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ పేరును.. రిపబ్లిక్‌ పార్టీ సెనేటర్ డేవిడ్‌ పెర్‌డ్యూ తప్పుగా సంబోధించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ విధమైన ప్రవర్తనను కమల మద్దతుదారులే కాకుండా పలువురు భారతీయ అమెరికన్లు ఖండిస్తున్నారు.మరో వైపు డేవిడ్‌ పెర్‌డ్యూ హ్యారిస్‌ పేరును సరిగా ఉచ్ఛరించలేకపోయారని.. అంతే తప్ప ఆయనకు అవమానించే ఉద్దేశమేదీ లేదని ఆయన ప్రతినిధి వివరణ ఇచ్చారు. అయితే ఆయన ఉద్దేశ పూర్వకంగానే అలా అన్నారనేది స్పష్టంగా తెలుస్తోందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news