కాబూల్ పై డ్రోన్ల దాడి.. అమెరికా ప్రతీకారం.

-

ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో జరిగిన ఉగ్రదాడుల్లో 13మంది అమెరికా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై అమెరికా ఆగ్రవాహవేశాలకు గురైంది. ఈ నేపథ్యంలో పగ తీర్చుకుంటాం అని తెలిపింది. చెప్పినట్టుగానే ప్రతీకార చర్యలు మొదలు పెట్టింది అమెరికా ప్రభుత్వం. కాబూల్ పై డ్రోన్ల దాడి చేసింది. ఆఫ్ఘన్ లోని ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, డ్రోన్ల దాడి చేసింది. ఐసిస్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసిన ఈ దాడిల్లో కాబూల్ దాడి వెనక ఉన్న ప్రధాన ఉగ్రవాది హతం అయినట్లు సమాచారం.

ఆఫ్ఘన్ లో నెలకొన్న పరిస్థితుల కారణంగా వెంటనే కాబూల్ ఎయిర్ పోర్టుని ఖాళీ చేయాలని అమెరికా పౌరులకు సూచించింది. అమెరికా ప్రతినిధుల ప్రకారం, కాబూల్ దాడిని ప్లాన్ చేసిన ఉగ్రవాది వాహనంలో వెళ్తూ ఉండగా, డ్రోన్ సాయంతో పేలుళ్ళు జరిపారు. ఆ పేలుళ్ళలో ప్లాన్ చేసిన ఉగ్రవాది హతం అయినట్లు వెల్లడించారు. మొత్తానికి మేం మర్చిపోం, మేం క్షమించలేం అన్న అమెరికా రోజుల వ్యవధిలోనే ప్రతీకార చర్యలు చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news