కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసే విషయంలో ఇప్పుడు వెంటిలేటర్ల అవసరం అనేది చాలా వరకు పెరిగింది అనే మాట వాస్తవం. దీనితో ఇప్పుడు మన దేశంలో వెంటిలేటర్ల తయారీ అనేది వేగంగా పెరుగుతోంది. మేడిన్ ఇండియా వెంటిలేటర్ల తయారు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కి చెందిన ఒక సంస్థ స్మార్ట్ వెంటిలేటర్లు తయారుచేసింది. లెవెన్ మెడికల్ మూడు మోడల్ వెంటిలేటర్లు తో ముందుకు వచ్చింది. స్మార్ట్ వెంటిలేటర్, సి 5 కోవిడ్ -19 వెంటిలేటర్ మరియు ఐసియు వెంటిలేటర్. ఈ వెంటిలేటర్లను తెలంగాణ ప్రభుత్వ ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు.
వెంటిలేటర్ల కోసం ఇతరుల మీద ఆధారపడకుండా హైదరాబాదులో వెంటిలేటర్లు తయారు చేశారని ఆయన పేర్కొన్నారు ఈ వెంటిలేటర్లు కరోనా వైరస్ యొక్క కాంటాక్ట్ లిస్ట్ ను కూడా బయటపెడతాయి అని ఆయన పేర్కొన్నారు. ఇక గత 14 రోజులుగా రోగి ఎక్కడైతే తిరిగాడు, వారందరికీ సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ వెంటిలేటర్లు గుర్తిస్తాయి అని ఆయన పేర్కొన్నారు.