తాజాగా అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన కాల్పుల ఘటన గురించి చర్చలు జోరందుకున్నాయి. టెక్సాస్ లో నివసిస్తున్న భారతీయ యువతిపై విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో ఆమె చనిపోయింది, కనీసం మృతదేహం ఎవరిదని గుర్తించడానికి కూడా వీలులేకుండా ముఖంపై కాల్చడంతో ఫింగర్ ప్రింట్స్ ను ఆధారంగా చేసుకుని గుర్తించారు. ఈ మృతి పట్ల భారతీయులు ఒక్కొకరుగా స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ మహిళా వ్యాపారవేత్త మరియు సింగర్ స్మిత తల్లి జోగులాంబ ఈ మృతిపై తన సంతాపాన్ని తెలియచేశారు. ఈమె సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ అమెరికాలో మాటి మాటికీ ఇలా కాల్పులు జరగడం.. అందులోనూ తెలుగు వారే ఎక్కువగా చనిపోతూ ఉండడం చాలా బాధను కలిగిస్తోంది అన్నారు.
ఈమె విదేశాలలో సెటిల్ అయ్యే విషయం మీద మాట్లాడుతూ.. మనకు ఉన్నదంట్లోనే కాలో గంజో తాగి స్వదేశంలోనే జీవిద్దాం అంటూ అభిప్రాయపడింది. ఇకపై ఎవరైనా విదేశాలలో సెటిల్ అవ్వాలి అన్న ఆలోచన ఉంటే విరమించుకుంటే మంచిదని చాలామంది అంటున్నారు.