తొక్కే కదా అని పారేస్తున్నారా.. అందులోనే ఉంది అసలైనా ఔషధం..!

-

మనం అరటిపండుని తిని తొక్క పడేస్తుంటాం. కానీ ఆరోగ్యానికి అరటిపండు మంచిదైతే..చర్మ ఆరోగ్యానికి ఆ అరటిపండు తొక్క ఇంకా మంచిదట. ఇది మీరు నమ్మరుకానీ అరటిపండు తొక్కతో ఎన్నో చర్మసమస్యలకు పరిష్కారం వస్తుంది. ఈరోజుల్లో చాలా మంది మహిళలు, యువతులు ముఖం పై పిగ్మెంటేషన్, మొటిమలతో బాధపడుతున్నారు. అరటిపండు తొక్క వారికి చాలాబాగా ఉపయోగపడుతుంది.

banana-peel

అరటితొక్కలో సిలికా ఎంటెంట్‌ ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఫినోలిక్స్, యాంటీమైక్రోబయల్‌ లక్షణాలు కలిగి ఉంటుంది.

ముఖానికి ఎలా అప్లై చేయాలంటే

అరటితొక్కలోని తెల్లటి భాగాన్ని మీ ముఖం మీద మొటిమలు, మచ్చలపై సున్నితంగా రుద్దాలి. దాన్ని 15 నిమిషాలపాటు అలాగే ఉంచి.. ఆపై ముఖాన్ని నీటితో కడుక్కోవాలి.

ఫైబర్‌ అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉండే అరటి తొక్క చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. చర్మంపై ముడతలు, మొటిమలను తగ్గిస్తుంది. ఇది మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్‌ చేయడానికి సహాయపడుతుంది. అరటి తొక్కలో యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయని అనేక అధ్యయనాల్లో తేలింది. సోరియాసిస్‌తో బాధపడుతున్నవారికి కూడా ఈ అరటి తొక్కతో దురద నుంచి ఉపశమనం కలగుతుందట.

తొక్కను తిన్నా కూడా మంచిదేనట. వినటానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజమేనండి. అరటి పండు తొక్కను తినడం వల్ల ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుందట. ఈ తొక్కలో లుటీన్ అనే పదార్థం ఉంటుంది. కాబట్టి ఇది దృష్టి సమస్యలను పోగొటట్టంలో ఉపయోగపడుతుంది. రేచీకటి, శుక్లాలు రావు. దెబ్బలు, గాయాలు, దురదలు, పురుగులు, కీటకాలు కుట్టిన చోట అరటి పండు తొక్కను రుద్దితే ఉపశమనం లభిస్తుంది.

అంతేకాదు అరటి పండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు దృఢంగా,తెల్లగా మారుతాయట. చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. అరటి పండు తొక్కనే నేరుగా తినలేమని అనుకునేవారు వాటిని జ్యూస్‌లా పట్టి కూడా తాగవచ్చు. లేదంటే అరటి పండు తొక్కను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చట.

అరటిపండులో కన్నా దాని తొక్కలోనే ఎక్కువ ఫైబర్ ఉంటుందట. ఇది శరీరంలోని చెడుకొలెస్ట్రాల్ తగ్గించటంలో బాగా పనిచేస్తుందట. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కూడా అరిటిపండు తొక్కను తినటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందట. ఇలా ఇన్ని లాభాలున్నాయనమాట అరటిపండుతొక్కలో. ఈ సారి పండుతిని తొక్కపారేసేముందు మీరు ట్రై చేయండి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news