ప్రజల సమస్యలకంటే కేసీఆర్ కు పట్టుదలే ముఖ్యం అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సచివాలయ కూల్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్త సచివాలయానికి కూడా డిజైన్ వచ్చేసింది. ఇక సచివాలయం కూల్చివేత పై చూపుతున్న శ్రద్ధ కేసీఆర్ ప్రజలపై చూపడం లేదని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం పీపీఈ కిట్లు లేవు కానీ కూల్చివేతకు తిరిగి నిర్మించడానికి మాత్రం నిదులు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.
ఈ కూల్చివేత పై ఉన్న శ్రద్ధని పట్టుదలను డాక్టర్లకు తగినన్ని పీపీఈ కిట్లు ఇవ్వడంలో , ప్రజలకు సరిపడా కరోనా టెస్టులు చేయించడంలో చూపాలని ఆయన తెలియజేశారు. కరోనా సంక్షోభంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని ఆయన గుర్తు చేశారు. అలాగే, రైతులకు రుణమాఫీ డబ్బులు లేవని ఇలాంటి సమయంలో కొత్త సచివాలయం అవసరమా? అని నిలదీశారు. సెక్రటేరియట్ కూల్చే సరైన సమయం ఇదేనా? పరాజలారా మీరు ఇకనైనా కళ్ళు తెరవండి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.