కేసీఆర్ ను ఎడమ కాలు చెప్పుతో కొట్టారు.. కాంగ్రెస్ మూతి పగులకొట్టారు : రాములమ్మ

సిఎం కెసిఆర్ పై మరోసారి బీజేపీ నేత విజయ శాంతి నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ ప్రజలు సిఎం కేసీఆర్ ను ఎడమ కాలు చెప్పుతో కొట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని… డిపాజిట్ కూడా రాలేదు…హుజూరాబాద్ లో కాంగ్రెస్ మూతి పగల గొట్టారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ డబ్బులు పని చెయ్యవని హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పారని చురకలు అంటించారు.

డబ్బుతో కాదు , ఉద్యమంతో సీఎం అయ్యావని.. హుజూరాబాద్ ప్రజలు ఉద్యమాన్ని గెలిపించారని స్పష్టం చేశారు విజయశాంతి. బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయం అని అక్కడి ప్రజలు చెప్పారని …. కెసిఆర్ పై ఉద్యమం చెయ్యమని చెప్పారని వెల్లడించారు. బీజేపీ టీమ్ వర్క్ గా పని చెయ్యాలి… మనలో విబేధాలు లేవని.. టిఆర్ఎస్, కాంగ్రెస్ లెక్క కాదని చెప్పాలని పిలుపునిచ్చారు.

ఫార్మ్ హౌస్ సీఎం గారు ఇప్పటికైనా మారండి.. భయంతోనే హుజూరా బాద్ ప్రచారానికి రాలేదని చురకలు అంటించారు. మిమ్మల్ని విమర్శించాలి అంటే భయ పడే వారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.. ఎన్ని రోజులు బతుకతావో తెలియదు… డబ్బులు ఏమి చేసుకుంటావని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.