గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీ రిమాండ్‌ను మళ్లీ పొడిగించింది. వంశీతో సహా ఐదుగురు నిందితులకు రిమాండ్ ఈ నెల 22 వరకు పొడిగించినట్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదే కేసులో వంశీ ప్రధాన అనుచరుడు రంగాపై పీటీ వారెంట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడికి కూడా ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో.. ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసి విజయవాడ తరలించారు. ఆ తర్వాత వంశీపై మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న వంశీకి రిమాండ్ ను ఏప్రిల్ 22వ తేదీ వరకు పొడిగించింది విజయవాడ కోర్టు.