డర్టీ ఎంపీ మాధవ్ కు సచ్ఛీలుడు అనే సర్టిఫికెట్ ఇస్తున్నారు : వంగలపూడి అనిత

-

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో అంటూ ఓ వీడియో తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ న్యూడ్‌ కాల్‌ వీడియోపై ఏపీ వ్యాప్తంగా రచ్చ జరగడంతో.. పోలీసులు దీనిపై దృష్టిసారించారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా.. అనంతపురం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడినట్టుగా భావిస్తున్న వీడియో ఒరిజనల్ కాదని వెల్లడించారు. అయితే.. దీనిపై టీడీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎంపీ మాధవ్ వ్యవహారంలో అనుకున్నట్టే జరిగిందని టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. తప్పును కప్పిపుచ్చడానికి చేయాల్సినవి అన్నీ చేస్తున్నారని ఆరోపించారు వంగలపూడి అనిత. డర్టీ ఎంపీ మాధవ్ కు సచ్ఛీలుడు అనే సర్టిఫికెట్ ఇస్తున్నారని విమర్శించారు వంగలపూడి అనిత.

vangalapudi anitha, ఆయన ఎక్కడికిపోతారు, ముందు వాళ్ల మొహాలు.. వంగలపూడి అనిత  ఆసక్తికర వ్యాఖ్యలు - ap tdp mahila wing president vangalapudi anitha  satires on ap cm ys jagan - Samayam Telugu

“అది ఒరిజినలో, కాదో అని నిర్ధారించలేకపోతున్నాం అని మీరు చెప్పారు… బాగుంది. మరి అలాంటప్పుడు అది ఎడిటింగ్, మార్ఫింగ్ అని ఎలా చెబుతారు? నిజం నిలకడ మీద కచ్చితంగా బయటికి వచ్చి తీరుతుంది. నేడు ఈ డర్టీ ఎంపీని సమర్థించిన వారందరూ ఆ రోజు తలదించుకోకతప్పదు” అని స్పష్టం చేశారు. కాగా, ఈ వీడియో వ్యవహారాన్ని సమర్థిస్తున్నారా, లేదా అనేది సీఎంగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా జగన్ రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని అనిత డిమాండ్ చేశారు. ఎంపీ మాధవ్ మీద చర్యలు తీసుకోనట్టయితే ఈసారి మీకు రాష్ట్ర మహిళల దెబ్బ గట్టిగా తగులుతుందని హెచ్చరించారు .

 

 

Read more RELATED
Recommended to you

Latest news