తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపుడి అనితకు హైకోర్టులో ఊరట లభించింది.వంగలపూడి అనితపై నమోదైన కేసులో తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇకపోతే వంగలపూడి అనిత తనపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టారంటూ నందిగామకు చెందిన సజ్జన రావు ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో అనితతోపాటు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తెలుగు మహిళలు సైతం పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఈ కేసులపై అనిత హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో అనిత తరపున న్యాయవాది సతీశ్ వాదనలు వినిపించారు. వాదనలను విన్న తర్వాత హైకోర్టు పోలీసులకు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అనితపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.