దీపావళికి వస్తున్న “వారసుడు” ఫస్ట్ సింగిల్ !

-

విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న వారసుడు అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టుగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ క్రమంలోని ఈ సినిమా కోసం విజయ్ దాదాపుగా రూ.100 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మొదటిసారిగా విజయ్ కి జోడిగా రష్మిక అలరించనుంది.

తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మూవీ యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే దీపావళికి ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా అనే ఆసక్తి అభిమానులలో నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం దీపావళికి ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయనున్నారట. బీస్ట్ చిత్రం తర్వాత విజయ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news