శీతాకాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. ఈ సమస ఎక్కువగా తలలో ఉంటుంది. తేమ లేకపోవడం వల్ల దురద, తల నుంచి పొట్టు వంటి సమస్యలు మొదలవుతాయి. ఇది శీతాకాలంలో మాత్రమే కాదు వాతావరణం వేడిగా ఉన్న జుట్టుపై ప్రభావం చూపుతుంది.
తలకు మాయిశ్చరైజర్ :
చుండ్రుకు ప్రదాన కారణం తలలో తేమలేకపోవడం. పూర్తిగా పొడిగా ఉండడం. ఈ సమస్య శీతాకాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది. చుండ్రు వల్ల జుట్టు మరిత పాడవకుండా ఉండాలంటే తలకు తగినంత తేమను అందివ్వాలి. అందుకు తలలో జుట్టు మొదుళ్ళకు పోషణను ఇచ్చే ఉత్పుత్తలు, మాయిశ్చరైజర్లు వాడాలి.
తలస్నానానికి ముందు మసాజ్ : తలస్నానం చేయడానికి ముందు తలకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. వాటిలో ఒకటి చుండ్రు నివారణ. ఆయిల్ మసాజ్ వల్ల జుట్టును బలంగా ఉంచుతుంది. తగిన పోషణ అందిస్తుంది. అందుకు కొబ్బరినూనె గొప్పగా సహాయపడుతుంది. ఈ నూనెను ఇతర నూనెలతో కలిపి వాడొచ్చు. కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేసి తలకు మర్దన చేయడం వల్ల చుండ్రు నివారించవచ్చు. తలస్నానానికి గంట ముందు దీన్ని తలకు రాసి తర్వాత తలస్నానం చేయాలి.
షాంపూ వాడకూడదు : జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం జుట్టుకు షాంపు పెట్టి శుభ్రం చేసుకోవడం సహజం. అయితే ఎక్కువగా షాంపు చేయడం వల్ల జుట్టు మాయిశ్చరైజర్ను కోల్పోతుంది. దాంతో సమస్య మరింత తీవ్రం అవుతుంది. కావున షాంపు మితంగా వారంలో రెండు మూడుసార్లు చాలు.
ఆల్కహాల్ ఉత్పత్తులకు దూరంగా : హెయిర్ ైస్టెల్ ఉత్పత్తులు మనం వాడడం సహజం. హెయిర్ ైస్టెల్ కొరకు రోజూ సిరమ్ నుంచి హెయిర్ జెల్ వారకు వాడుతుంటాం. చుండ్రు సమస్య ఉండకూడదనుకుంటే ఇలాంటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ ఉన్న ఉత్పత్తులు వల్ల జుట్టులో తేమను కోల్పోతుంది. దీంతో జుట్టు పొడిబారి చుండ్రు అధికం అవుతుంది.
యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడాలి : చుండ్రుతో పోరాడే ప్రభావ వంతమైన పదార్థాలతో తయారు చేసిన యాంటీ డాండరఫ్ షాంపును ఎంపిక చేసుకోవాలి. వీటిని కొన్ని నెలలపాటు క్రమం తప్పకుండా వాడాలి. చుండ్రు పూర్తిగా తొలిగిపోవాలంటే కనీసం ఒక నెల సమయం పడుతుంది. అంత వరకు మీరు ఓపికగా వేచి చూడాలి.
సూర్యకిరణాల నుంచి జుట్టుకు రక్షణ : తలలో చుండ్రుకు కారణం సూర్యరశ్మి కూడా ఒక కారణం. సూర్యుని నుంచి వెలువడే యూవీ కిరణాల ఇటు చర్మం, అటు జుట్టుకు హాని కలిగిస్తాయి. కాబట్టి బయట వెళ్ళేటప్పుడు జట్టుకు రక్షణ కల్పించాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తలకు క్యాప్ పెట్టుకోవాలి.
సరైన ఆహారం : చుండ్రు నివారణకు మీరు తీసుకునే ఆహారం కొద్ది మార్పులతో పూర్తిగా నివారించుకోవచ్చు. మీరు రోజూ తినే ఆహారంలో సరైన విటమిన్లు మరియు పోషకాలు ఉండేట్లు చూసుకోవడం వల్ల ఇవి చుండ్రుకు కారణమయ్యే ఇతర సమస్యలతోపాటు తలలో ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియాను నివారిస్తాయి.