చాలా మంది భార్యాభర్తల మధ్య ఏవేవో సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యల నుండి బయట పడాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగలన్నా వాళ్ళ మధ్య సమస్యలు దూరమవ్వాలన్న ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. ఇక మరి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలని ఎలా పెంచుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. వాస్తు ప్రకారం పండితులు చెప్పినట్లు పాటిస్తే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలానే సమస్యలు ఉన్నా చిన్నచిన్న గొడవలు ఉన్నా కూడా తొలగిపోతాయి అందుకని భార్యాభర్తలు కచ్చితంగా వీటిని పాటించాలి.
భార్యాభర్తలు బెడ్రూంలో మంచి గాలి వెలుతురు వచ్చేటట్టు చూసుకోవాలి. బెడ్ రూంలో కాస్త చిన్నగా ఉండే లైట్ ని ఉంచుకోవడం మంచిది ఇది మంచి వైబ్రేషన్స్ ని తీసుకువస్తుంది. బెడ్ రూమ్ రంగుల విషయంలో కూడా భార్యాభర్తలు జాగ్రత్త వహించాలి లైట్ కలర్స్ ని బెడ్ రూమ్ లో వేయడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలానే బెడ్రూంలో అద్దాలని ఉంచకండి. అద్దం ఉంటే భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ లో సమస్యలు కలుగుతాయి.
అలానే భార్యాభర్తలు నిద్రపోయే మంచం చెక్కది అయి ఉంటే మంచిది. స్టీల్ ఐరన్ వంటి వాటిని వాడకండి ఇవి నెగటివ్ ఎనర్జీని కలిగించేసి పాజిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. భార్యాభర్తలు బెడ్రూంలో ప్రశాంతత ఉండేటట్టు చూసుకోవాలి. చెత్తాచెదారం అసలు ఉంచకండి. అలానే భార్యాభర్తలు ప్రతి చిన్న దానికి కూడా గొడవ పడకూడదు. వీలైనంతవరకు అడ్జస్ట్ అవుతూ ఉండాలి భార్యాభర్తలు ఒక్కొక్కసారి సర్దుకుంటూ పోతే జీవితం బాగుంటుంది ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే భార్యాభర్తల బంధం బాగుంటుంది ప్రేమ పెరుగుతుంది.