వీర‌సింహారెడ్డి ఓటీటీలోకి వ‌చ్చేది ఆ రోజే – డేట్ టైమ్ ఫిక్స్‌

-

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడా చూసినా బాలయ్య సినిమా గురించే చర్చ నడిచింది. మొదటి రోజు నుండే వసూళ్ళు కూడా అనుకున్నట్టే అదరగొట్టాయి.

మరో వైపు ఈ సినిమా లోని డైలాగ్స్ పై ప్రభుత్వం కూడా ఒక కన్ను వేసింది. ఇది కలకలం రేపింది. ఇక ఈ సినిమా వసూళ్ళు చూసుకుంటే కొద్దిగా చిరంజీవి సినిమా ఉండటం వల్ల కొంచం తగ్గిపోయాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా కూడా బాలయ్య బాబు వీర సింహ రెడ్డి తో బ్రేక్ ఈవెన్ ను దాటి, ప్రాఫిట్స్ లోకి వచ్చింది. ఇక ఆల్మోస్ట్ థియేటర్ వసూళ్ళు కూడా చివరి దశకు వచ్చాయి. ఇప్పడు అందరి కళ్లు ఓటిటి రిలీజ్ మీద పడ్డాయి. ఓటీటీ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ డిస్నీప్లస్ హాట్ స్టార్…స్ట్రీమింగ్ తేదీని కూడా ఫైనల్‌ చేసింది. ఫిబ్రవరి 23వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news