సిఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలనం

రోశయ్య సంస్మరణ సభ ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసక్తి కర వ్యాఖ్యలు చేశారు. రోశయ్య విలువలతో కూడిన రాజకీయం చేసారని.. రోశయ్య సహకారంతోనే నేను ఈ స్థాయికి చేరానని వెల్లడించారు. రోశయ్య రాష్ట్రానికి చేసిన సేవలను ఎప్పటికి గుర్తు పెట్టుకుంటామని.. కెసిఆర్ ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

అనంతరం టి.సుబ్బిరామి రెడ్డి మాట్లాడుతూ.. రోశయ్య పదవులు శాశ్వతంకాదు, ఎదుటివారికి సహాయం చేయాలనీ ఎప్పుడు చెప్తుండేవారని పేర్కొన్నారు. ఏ పదవిలో ఉన్న ఎప్పుడు ఆహం కారం చూపించలేదని.. తెలుగుజాతి గర్వించేల రోశయ్య జీవనశైలి సాగిందన్నారు. నేటి రాజకీయ నాయకులు రోశయ్యను చూసి ఎంతో నేర్చు కోవాలని.. సీఎంలకు సరైన సలహాలు ఇచ్చిన ఏకైన నేత రోశయ్య వెల్లడించారు. ఇప్పటి నేతలు ఏం మాట్లాడు తున్నారో అర్థం కావడం లేదని.. రాజకీయ నాయకులంటే అసహ్యహించుకునే పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పారు.