శిల్పాశెట్టి భర్తకు అరెస్టు నుంచి ఉపశమనం

వ్యాపార వేత్త రాజ్ కుంద్రకు చిన్నపాటి ఉపశమనం లభించింది. అశ్లీల చిత్రాల చిత్రీకరణ, ప్రసారంపై రాజీవ్ కుంద్రాపై నమోదైన పలు కేసుల్లో నాలుగు వారాలపాటు అరెస్టును ఉపశమనం కల్పిస్తూ బుధవారం సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది.

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త అయిన రాజీవ్ కుంద్రా ముందస్తు బెయిల్ కోరుతూ నవంబర్ 25న పిటిషన్ దాఖలు చేయగా బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తాను చిత్రీకరించిన వీడియోలు శృంగారభరితమైన తప్పా సెక్స్ యాక్టివిటీ లేదా శారీరక సంబంధాలకు సంబంధించినవి కావని బాంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో రాజ్ కుంద్రా పేర్కొన్నారు. అశ్లీల చిత్రాల చిత్రీకరించడం గానీ ప్రసారం చేయడం గానీ చేయలేదని పేర్కొన్నారు. తనను అక్రమ కేసులో ఇరికించారని రాజీవ్ కుంద్రా ఆరోపించారు.