IND vs NZ T-20 : టీం లోకి యువ సంచ‌ల‌నం వెంక‌టేష్ అయ్యార్

-

భార‌త్ లో న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న రానున్న విష‌యం తెలిసిందే. భార‌త ప‌ర్య‌ట‌న లో భాగంగా ఇప్ప‌టికే న్యూజిలాండ్ త‌మ జ‌ట్టు ను ప్ర‌క‌టించింది. తాజాగా ఇండియా జ‌ట్టు ను కూడా బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టు కు రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించనున్నాడు.

అలాగే కె ఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా బీసీసీఐ నియ‌మించింది. అలాగే ఐపీఎల్ యువ సంచ‌ల‌నం వెంక‌టేష్ అయ్యార్ కూడా జ‌ట్టు కు ఎంపిక అయ్యాడు. కాగ ఈ నెల 17 నుంచి న్యూజిలాండ్ తో టీ ట్వంటి సిరీస్ ప్రారంభం కానుంది. అయితే న్యూజిలాండ్ తో ఆడే జ‌ట్టు ఇలా ఉంది.

రోహిత్ శ‌ర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయ‌స్ అయ్యార్‌, సూర్య కుమార్ యాద‌వ్, రిష‌బ్ పంత్ ( వికెట్ కీప‌ర్‌), ఇష‌న్ కిషన్‌, వెంక‌టేష్ అయ్యార్‌, చాహ‌ల్, అశ్విన్‌, అక్ష‌ర్ ప‌టేల్, అవేశ్ ఖాన్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్, దీప‌క్ చాహర్, హ‌ర్ష‌ల్ ప‌టేల్, సిరాజ్

అలాగే ఈ టూర్ కు కు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది.

న‌వంబ‌ర్ 17న జైపూర్ వేదిక‌గా తొలి టీ -20. న‌వంబ‌ర్ 19న రాంచీ వేదిక‌గా రెండో టీ- 20. న‌వంబ‌ర్ 21న కోల్ క‌త్త వేదిక గా మూడో టీ-20 జ‌రుగబోతుంది. అలాగే న‌వంబ‌ర్ 25 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. 25న తొలి టెస్ట్ కాన్పూర్ వేదిక‌గా జ‌రుగబోతుంది. అలాగే డిసెంబ‌ర్ 3 నుంచి ముంబై వేదిక గా రెండో టెస్ట్ ప్రారంభం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version