దర్శకుడిగా వేణుకి మరో ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు

-

దిల్ రాజుకి నిర్మాతగా ఎంత అనుభవం ఉందో మనందరికీ తెలిసిన విషయమే. తన సొంత బ్యానర్లో ఇప్పటివరకు 50 సినిమాలను నిర్మించారు దిల్ రాజు. దిల్ రాజును కథ విషయంలో ఒప్పించడం అంటే అంత సులువైన పని మాత్రం కాదు. అలాంటిది దిల్ రాజు బ్యానర్లో కమెడియన్ వేణు ‘బలగం’ అనే సినిమాను తెరకెక్కించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతగా ‘బలగం’ సినిమాలో ఏముందా అని వెళ్లినవారికి, దిల్ రాజు ఎందుకు ఒప్పుకున్నాడనే విషయం తెలుస్తుంది.

 

తెలంగాణ నేపథ్యంలోని గ్రామీణ సంస్కృతిని ఆవిష్కరిస్తూ, కామెడీని .. ఎమోషన్ ను కలిపి నడిపించిన తీరుకు ఎక్కువ మార్కులు వచ్చాయి. పాటల పరంగా కూడా ఈ సినిమా బాగా సందడి చేసింది. వేణు పనితీరు నచ్చడం వలన ఆయనకి దిల్ రాజు మరో ఛాన్స్ ఇచ్చారనే టాక్ రెండు రోజులుగా పలు చోట్ల వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్టు ఓకే అయిందనేది ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం. ఓ మాదిరి బడ్జెట్ లోనే ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పై నిర్మితమయ్యే ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news