విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్స్.!

-

ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, డైరెక్టర్.. ప్లే బ్యాక్ సింగర్, ఎడిటర్, లిరిసిస్ట్, ఆడియో ఇంజనీర్, హీరో ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయస్తుడైన ఈయన తాజాగా మలేషియాలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పై సరైన సమాచారం అందడం లేదు. కొంతమంది ఆయన ఆరోగ్య పరిస్థితి అంత విషమం కాదు అని తోసిపుచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. కొంతమంది మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని చెబుతున్నారు.

విజయ్ ఆంటోనీ ప్రస్తుతం బిచ్చగాడు 2 సినిమా షూటింగ్లో ఉన్నాడు. మలేషియాలో బోట్ సీన్ ఒకటి షూట్ చేస్తున్న సమయంలో .. ప్రమాదం చోటు చేసుకోగా.. విజయ్ ఆంటోనీ ఉన్న బోట్ ఎదురుగా ఉన్న మరో బోట్ ను ఢీకొట్టింది. దాంతో విజయ్ కింద పడడంతో గాయాలయ్యాయి. ఆయన భార్య ఫాతిమా విజయ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కింద పడినప్పుడు విజయ్ పళ్ళు, దవడ ఎముక విరిగినట్లు.. ముఖానికి కూడా గాయాలైనట్లు సమాచారం.

బుధవారం సాయంత్రం మలేషియా నుండి విజయ్ ఆంటోనీని చెన్నైకి తీసుకొచ్చారు. అయితే ఒకవైపు విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు ఇప్పుడే చెప్పలేమంటున్నారని వార్తలు వస్తున్నప్పటికీ.. ఆయన కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు మాత్రం మరోలా చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం అని వస్తున్న వార్తలు అవాస్తవమని బుధవారం సాయంత్రం చెన్నై చేరుకున్న ఈయన సినిమా పనులు చూసుకుంటున్నారని కూడా చెబుతున్నారు. అంతేకాదు నడుముకు మాత్రమే చిన్న గాయం తగిలిందని.. ప్రస్తుతం ఆయన సినిమా పనులు చూసుకుంటున్నారు అంటూ క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఏది నిజమో తెలియక అభిమానులు సందిగ్ధంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version