Liger: వ‌రల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ తో రౌడీ .. పిక్స్ వైరల్..

-

Liger: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబో తెర‌కెక్కుతోన్న సినిమా ‘లైగర్’. బాక్సింగ్ నేపథ్యంలో నిర్మితమ‌వుతున్న ఈచిత్రంలో వ‌రల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో న‌టించ‌డం మ‌రో విశేషం. విజయ్ దేవరకొండ గురువు పాత్రలో టైస‌న్ నటించబోతున్నట్టు సమాచారం.

తాజా ఈ సినిమా షెడ్యూల్.. అమెరికాలోని న‌డుస్తుంది. ఈ షెడ్యూల్ లో ‘లైగర్’ మూవీ క్లైమాక్స్‌ను సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో మైక్ టైసన్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, అనన్య పాండేతో పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి మైక్ టైసన్‌తో కలిసి దిగిన ఫోటోలను అభిమానుల‌తో పంచుకున్నారు మూవీ మేక‌ర్ ఛార్మీ. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఈసినిమాను పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అటు పూరీ, ఇటు రౌడీ కెరీర్‌లో కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా చెప్ప‌వ‌చ్చు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీల‌క పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడి కింగ్ మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news