నా సినిమా బాయ్ కాట్ చేస్తారా.. చూసుకుందాం – విజయ్ దేవరకొండ వార్నింగ్

-

లైగర్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ సందర్భంగా హీరో విజయదేవర కొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల నుంచి లైగర్ సినిమా తీస్తున్నామని.. ఇంకా ఐదు రోజులు సినిమా విడుదలకు ఉందన్నారు. ఇవాల్టి నుంచి ఎపి, తెలంగాణా లో టిక్కెట్స్ ఓపెన్ అయ్యాయని.. ప్రాణం పెట్టి లైగర్ సినిమా తీశాం.. అందరికీ సినిమా నచ్చుతుందని వెల్లడించారు హీరో విజయ దేవరకొండ.

పూరి కధ చెప్పగానే మెంటలొచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా.. నటిస్తున్నప్పుడు త్రిల్ ఉందని వెల్లడించారు. సినిమాను ఇండియా కు పరిచయం చేసింది కరన్ జోహార్ అని గుర్తు చేశారు. మూడేళ్లు కష్టపడి పనిచేశాం.. సినిమా తీసి ఇంట్లో కూర్చోవాలా అని ఫైర్‌ అయ్యారు. మనం ధర్మం తో ఉన్నాం..ఏదొచ్చినా కొట్లాడుడేనని పేర్కొన్నారు. కరోనా సమయంలో చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ కు సహకరించారు.. వాళ్లిచ్చిన డబ్బు లతో నే సేవ చేశానని వివరించారు. తల్లి సెంటిమెంట్ తో ఇండియా ఫ్లాగ్ ఎగురవేస్తే బాయ్ కాట్ చేస్తారా ..చూద్దాం… ఆల్రడీ బుకింగ్స్ ఓపెనయ్యాయన్నారు
హీరో విజయ దేవరకొండ.

Read more RELATED
Recommended to you

Latest news