Breaking : విజయసాయిరెడ్డికి సన్సద్ రత్న అవార్డు

-

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి అవార్డు దక్కింది. సాయిరెడ్డి ‘సన్‌సద్‌ రత్న'(పార్లమెంటరీ రత్న) అవార్డుకు ఎంపికయ్యారు. 2023 ఏడాదిగానూ సన్‌సద్‌ రత్న అవార్డు విజేతల లిస్ట్‌ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. ప్రధాని మోదీ అవార్డు గ్రహీతలను అభినందించారు. విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ తరపున రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. జ్యూరీ కమిటీ ఈఏడాదికిగానూ పదమూడు మంది ఎంపీలతో పాటు 2 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు, 1 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రకటించింది.

ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రజలతో తన సంతోషాన్ని పంచుకున్నారు. తాను చైర్మన్‌గా ఉన్న స్థాయి సంఘానికి అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. మా కమిటీకి సంసద్ రత్న అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది . స్టాండింగ్ కమిటీలలో ప్రతి అంశంపై లోతైన చర్చ ఉంటుంది. అన్ని అంశాలను అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు చర్చిస్తారు. గతంలో కామర్స్ కమిటీ చేసిన సిఫార్సులను 95% కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అని గుర్తు చేశారాయన. అలాగే.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తరహాలో రాష్ట్రాల్లో కూడా స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఎంపీల తరహాలో, ఎమ్మెల్యేలు కూడా చట్టాల తయారీలో భాగస్వామ్యం కల్పించినట్లు అవుతుందని ఆయన ఆకాంక్షించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news