సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ కానున్న ‘ఖుషీ’

-

విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషీ’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అప్డేట్స్ కోసం హీరో-హీరోయిన్ల అభిమానులంతా ఎప్పటికప్పుడు తమ ఆసక్తిని కనపరుస్తూనే ఉన్నారు. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సమంత చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని తెలియచేసారు సినిమా సిబ్బంది. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Khushi movie release date confirmed

ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ – సమంత ఇద్దరూ కూడా ఒక కొత్త లుక్ తో కనిపిస్తున్నారు. శివ నిర్వాణకి పేమకథల స్పెషలిస్టుగా మంచి పేరు ఉంది. ‘నిన్నుకోరి’ .. ‘మజిలీ’ సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఆ తరువాత ‘టక్ జగదీశ్’తో వేరే జోనర్ లోకి వెళ్లిన ఆయనకి నిరాశే ఎదురైంది. దాంతో మళ్లీ ఈ సారి ప్రేమకథనే సెట్ చేసుకున్నాడు. ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి మరి అంటున్నారు అభిమానులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news