బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ‘సోము వీర్రాజు BJP AP అధ్యక్షుడిగా కొనసాగితే అవినీతిపరులకు మద్దతు పలికేవారు కాదు. టీడీపీ బలహీనతను వీర్రాజు తన పార్టీకి అనుకూలంగా మార్చుకునేవారు. బావ సారూప్యత సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. చంద్రబాబు డీకే శివకుమార్ ద్వారా ఇండియా కూటమికి దగ్గరవుతున్న విషయం బీజేపీ అధిష్ఠానానికి తెలుసు’ అని ట్వీట్ చేశారు.
ఇది ఇలా ఉంటె, విజయసాయిరెడ్డి ఎదుటే వైసీపీ నేతలు చెంపలు పగులుగొట్టుకున్నారు. ఒకరినొకరు నెట్టుకుంటూ వీధి పోరాటానికి దిగారు. దీంతో నియోజకవర్గ సమావేశాలు రసాభాసగా మారాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విభేదాలు వెలుగు చూశాయి. నేతల మధ్య ఆధిపత్య పోరును చూసి విజయసాయిరెడ్డి షాక్ కు గురయ్యారు.గత రెండు రోజులుగా విజయ్ సాయి అధ్యక్షతన నియోజకవర్గాల రివ్యూలు జరుగుతున్నాయి. అయితే ఒంగోలు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల మినహా.. మిగతా అన్ని నియోజకవర్గాల్లో వర్గ రాజకీయాలు వెలుగు చూశాయి. సంతనూతలపాడు సమీక్ష కొట్లాటకు దారితీసింది. ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, నాగులుప్పలపాడు ఎంపీపీ నల్లమలుపు అంజమ్మ భర్త కృష్ణారెడ్డి వర్గాలు కొట్లాటకు దిగాయి. ఎంపీపీ అంజమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యేసుధాకర్ బాబు వైఖరిని తప్పు పట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరుడు విజయ్ కుమార్ ఆమెను నెట్టేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటిస్తూ విజయ్ కుమార్ చెంపను చెల్లుమనిపించారు. దీంతో రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఈ హఠాత్ పరిణామంతో విజయ్ సాయి రెడ్డి ఆందోళనకు గురయ్యారు. పార్టీ శ్రేణులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు శాంతించారు.